Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాస్టార్ కి శుభాకాంక్షల వెల్లువ!

Chiranjeevi Special
Advertisement
  • 'పద్మ విభూషణ్'తో పండగ వాతావరణం 
  • అభినందనలు అందుకోవడంతో మెగా స్టార్ బిజీ 
  • శుభాకాంక్షలు తెలియజేసిన నటుడు సాగర్ 
  • రిలీజ్ కి రెడీగా ఆయన హీరోగా చేసిన 'ది 100'

Advertisement
తెలుగు సినిమా ప్రపంచంలోకి ఒక సుడిగాలిలా .. సునామీలా చిరంజీవి దూసుకొచ్చారు. హీరోగా సరైన బ్రేక్ వచ్చేవరకూ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను సైతం పోషిస్తూ వెళ్లారు. ఆల్రెడీ బరిలో ఉన్న స్టార్ హీరోలకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని, అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. తెలుగు సినిమా కథలను .. పాటలను .. డాన్సులను .. ఫైట్లను పరిగెత్తించారు. అంతగా ప్రభావితం చేసిన హీరో ఇంతవరకూ మళ్లీ రాలేదనే చెప్పాలి. 

అలా 150కి పైగా సినిమాలను పూర్తి చేసుకున్న చిరంజీవి, కొత్త దర్శకులను .. కొత్త నటులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని పేద కళాకారులను ఆదుకుంటూనే, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మెగాస్టార్ ను 'పద్మ విభూషణ్' పురస్కారం లభించింది. దాంతో పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. 

ఈ నేపథ్యంలో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు .. సినీ రంగానికి చెందిన స్టార్స్ సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది చిరంజీవిని నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తాజాగా 'మొగలిరేకులు' ఆర్కే నాయుడు (సాగర్) చిరంజీవిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు. సాగర్ హీరోగా చేసిన 'ది 100' సినిమా త్వరలో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Advertisement
Chiranjeevi
Sagar
Actor
Tollywood

More Telugu News